హైదరాబాద్‌లో పరుగులు పెట్టనున్న డబుల్‌ డెక్కర్‌

మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌ రోడ్లపై ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గతంలో తిరిగిన డబుల్‌ డెక్కర్‌ బస్సులతో పోలిస్తే సాంకేతిక పరంగా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్‌, హైదరాబాద్‌ రోడ్లకు అనువైన...

Updated : 06 Mar 2021 11:47 IST

హైదరాబాద్‌: మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌ రోడ్లపై ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గతంలో తిరిగిన డబుల్‌ డెక్కర్‌ బస్సులతో పోలిస్తే సాంకేతిక పరంగా మంచి సామర్థ్యం ఉన్న ఇంజిన్‌, హైదరాబాద్‌ రోడ్లకు అనువైన బస్సు బాడీ వంటివి ఉండాలని ఆర్టీసీ సంస్థ టెండర్‌ దాఖలు సమయంలోనే స్పష్టం చేసింది. ఇటీవల టెండర్లలో పాల్గొన్న అశోక్‌ లేలాండ్‌.. ఆర్టీసీ కోరినట్లు బస్సులను సమకూరుస్తామని చెప్పింది. మొదటి దశలో 25 బస్సులు కావాలని కోరగా అదే విధంగా అందజేస్తామని సంస్థ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆర్థిక కమిటీ సమావేశమై బస్సుల ధరపై చర్చించి టెండర్‌కు ఆమోద ముద్ర వేసే అవకాశముంది.

హైదరాబాద్‌లో సుదీర్ఘ విరామం తర్వాత నడిపేందుకు నిర్ణయించిన డబుల్‌ డెక్కర్‌ బస్సుల కోసం ప్రభుత్వం టెండర్లకు ఆహ్వానించింది. అయితే బీఎస్‌-6 ప్రమాణాల మేరకు బస్సులను తయారు చేయాలంటే ఖర్చుల అంచనాలు తయారు చేసేందుకు మరింత సమయం కావాలని కోరటంతో టెండర్ల గడువును అధికారులు ఇటీవల పొడిగించారు. అయితే చివరకు అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఒక్కటే టెండరు దాఖలు చేసింది. ఆ సంస్థతో ఆర్టీసీ అధికారులు చర్చించారు. అయితే ఒక్కో బస్సు తయారు చేసేందుకు ఆ సంస్థ ఎంత మొత్తాన్ని కోట్‌ చేసిందన్నది తెలియరాలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని