మూగ జీవాలకూ ఉందో చలివేంద్రం..!

విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కూండ్రపువాని పాలెంకు చెందిన రాధాకృష్ణ దంపతులు ఆరేళ్లుగా చలివేంద్రం ఏర్పాటుచేసి మూగజీవాల దాహార్తి తీరుస్తున్నారు. ప్రత్యేకంగా మట్టి పాత్రల్లో నీటిని పోసి అందిస్తున్నారు....

Published : 11 Apr 2021 16:41 IST

విశాఖ: వేసవి వచ్చిందంటే పాదచారులు, ప్రయాణికుల కోసం రోడ్ల పక్కన చలివేంద్రాలు ఏర్పాటుచేస్తారు. కానీ మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నీరు దొరక్క అవి అల్లాడిపోతుంటాయి. వాటి అవస్థలు చూసి చలించిపోయిన విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కూండ్రపువాని పాలెంకు చెందిన రాధాకృష్ణ దంపతులు ఆరేళ్లుగా చలివేంద్రం ఏర్పాటుచేసి మూగజీవాల దాహార్తి తీరుస్తున్నారు. ప్రత్యేకంగా మట్టి పాత్రల్లో నీటిని పోసి అందిస్తున్నారు. ఇప్పుడు ఎన్నో మూగజీవాలు వచ్చి హాయిగా గొంతు తడుపుకొంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని