2021 తొలినాళ్లలోనే చంద్రయాన్‌-3!

జాబిల్లి గుట్టును విప్పేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు 2021 తొలినాళ్లలోనే ప్రయోగించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.

Published : 08 Sep 2020 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాబిల్లి గుట్టును విప్పేందుకు భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టును 2021 తొలినాళ్లలోనే ప్రయోగించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. చివరి క్షణంలో విఫలమైన చంద్రయాన్‌-2 మాదిరిగా ఇందులో ఆర్బిటర్‌ ఉండదన్న ఆయన ల్యాండర్‌, రోవర్‌లు ఉంటాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పలు ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడి వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వివరించారు.
ఈ సందర్భంగా చంద్రయాన్‌-1 మిషన్‌ గురించి మంత్రి కీలక విషయాలు వెల్లడించారు. జాబిల్లిపై ఇస్రో తొలి ప్రయోగం చంద్రయాన్‌1ను 2008లో చేపట్టగా చంద్రుడిపై ఇనుముతో కూడిన రాతినేల ఉందని తేలినప్పటికీ అక్కడ నీరు, ఆక్సిజన్‌ ఉన్నట్లు ఇంకా తెలియదని చెప్పారు. నీటి జాడలు ఉన్నట్లు తెలుస్తుండగా దాన్ని తెలుసుకునేందుకే శాస్ర్తవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని