AP NEWS :క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ అమలును పరిశీలించండి: సీఎం జగన్‌

అన్ని జిల్లాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని..

Published : 27 Jan 2022 21:45 IST

అమరావతి:  అన్ని జిల్లాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్షించారు. ఆన్‌లైన్‌ వేదికగా శ్రీసిటీలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను జగన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో నోవా ఎయిర్‌ టెక్నాలజీస్ ఎండీ గజనాన్ నబర్, ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..  కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య స్వల్పంగా ఉందని అధికారులు వివరించారు. ఆసుపత్రుల్లో చేరినవారూ చికిత్సతో కోలుకుంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నవారికి మెరుగైన సదుపాయాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కింద పూర్తి చికిత్స అందించాలని స్పష్టం చేశారు. విప్లవాత్మక చర్యగా మనం ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని చెప్పారు. దేశానికే ఆదర్శంగా ఆరోగ్యశ్రీతో వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. జీఎంపీ ప్రమాణాలున్న మందులనే ఆసుపత్రుల్లో ఇస్తున్నామని వెల్లడించారు. నాడు-నేడుతో ఎన్నడూ లేని విధంగా డబ్బు ఖర్చు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దానిద్వారా ఆరోగ్యశ్రీ మరింత బలోపేతంగా ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని