TS High Court: మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరం: హైకోర్టు

తెలంగాణలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు.

Published : 25 Jan 2022 12:47 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఫీవర్‌ సర్వేలో భాగంగా మూడు రోజుల్లోనే 1.70లక్షల జ్వర బాధితులను గుర్తించారన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ కిట్‌లో పిల్లలకు అవసరమైన మందులు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానానికి చెప్పారు. దీనిపై ఏజీ ప్రసాద్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటోందన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్రంలో మాస్కులు, భౌతికదూరం అమలు కాకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేసింది. కొవిడ్‌ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్‌ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని