Whiskey Bottle: రూ.4 కోట్లు పలికిన విస్కీ బాటిల్‌.. ఎక్కడంటే..!

చవక ధరలకే మద్యం లభిస్తున్నా కాదని ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని భారీ ధర చెల్లించి మద్యం సీసాను కొనుగోలు చేశాడు.

Published : 18 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చవక ధరలకే మద్యం లభిస్తున్నా కాదని ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని భారీ ధర చెల్లించి మరీ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్‌ షాపులో 55ఏళ్ల ఓల్డ్‌ విస్కీ ది యమ జాకీని వేలంలో పెట్టారు. దీన్ని సొంతం చేసుకునేందుకు 8మంది పోటీ పడగా, చివరకు చైనాకు చెందిన ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లకు దక్కించుకున్నాడు. అంటే భారత కరెన్సీలో ఆ విస్కీ బాటిల్‌ ధర సుమారు రూ.4.14 కోట్లు అన్నమాట.

రికార్డ్‌ స్థాయిలో విస్కీబాటిల్‌ అమ్మకం జరగడంతో యూనీఫ్రీ డ్యూటీ ఫ్రీ సీఈవో అలీ సెన్హర్‌ ఆనందం వ్యక్తం చేశారు. తమ స్టోర్‌లో భారీ స్థాయిలో వేలం జరగడంతో ఎయిర్‌పోర్ట్‌ రిటైల్‌లో ప్రత్యేక ఉత్పత్తులు అమ్మేందుకు సహాయపడుతుందని ఈ వేలం రుజువు చేసిందని అలీ తెలిపారు. దీన్ని జపాన్‌కి చెందిన మిజనారో కలపతో తయారుచేసిన ప్రత్యేక బాక్స్‌లో అందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని