Kidney stones: కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? ఎలాంటి ఆహారం మేలు!

 కిడ్నీలో రాళ్లు ఉన్నాయనగానే రకరకాల ప్రయత్నాలు మొదలెడుతారు. ఆహారంలో మార్పులు, అతిగా మంచినీళ్లు తాగడానికి సిద్దమవుతారు.

Published : 22 May 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిడ్నీలో రాళ్లు ఉన్నాయనగానే రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆహారంలో మార్పులు, అతిగా మంచినీళ్లు తాగడానికి సిద్ధమవుతారు. ఏం తినాలన్నా సంకోచిస్తారు. సవాలక్ష పత్యాలను పాటిస్తారు. టమాటా, పాలకూరకు దూరంగా జరిగిపోతారు. నిజానికి కిడ్నీలో రాళ్లు ఉన్నపుడు కఠినమైన పత్యాలు పాటించాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ కిడ్నీల ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణురాలు అంజలీదేవి సూచిస్తున్నారు.

కిడ్నీలో రాళ్లు ఇలా వస్తాయి...

🔴 కిడ్నీలో రాళ్లు రెండు రకాలుగా ఉంటాయి. కాల్షియం అక్సినేట్‌, కాల్షియం ఫాస్పేట్‌

🔴 వ్యాయామం చేయకపోయినా, స్థూలకాయం ఉన్నా మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి.

🔴 రక్తంలోని మలినాలను వడగట్టడంలోనూ శరీరంలోని అమ్ల, క్షార స్థాయిని నియంత్రించడంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా పనిచేసే సమయంలో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. రాళ్లు కూడా ఇలాగే ఏర్పడుతుంటాయి. 

🔴 నీళ్లు తక్కువగా తాగుతున్నప్పుడు, మాంసాహారం అధికంగా తిన్నపుడు, స్టిరాయిడ్‌లను ఎక్కువ మోతాదులో తీసుకున్నపుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. 

🔴 శరీరంలో విటమిన్‌ బి6, సి లోపం ఉన్నపుడు.. విటమిన్‌ డి అధికంగా ఉన్నప్పుడు, మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉన్నపుడు రాళ్ల వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

🔴 కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకినపుడు, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు వస్తాయి.

🔴 ఆలస్యంగా భోజనం చేయడంతో పాటు నిద్ర సరిగా పోని వారికీ రాళ్లు ఏర్పడతాయి.  

ఈ ఆహారంతో  కిడ్నీలకు మేలు

🔴 కిడ్నీలో రాళ్లు ఉన్నపుడు రోజుకు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి. 

🔴 రాత్రి పూట మెంతులను నానపెట్టి ఉదయం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 

🔴 కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ప్రతి రోజు తాగడంతో రాళ్లు కరిగిపోయే అవకాశం ఉంది. 

🔴 పాలకూర, టమోటాలు, పాలు ఏవైనా కలిపి తీసుకోవద్దు. విడివిడిగా తీసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదు. 

🔴 చక్కెర, ఉప్పు బాగా తగ్గించాలి. అధిక కారం, మసాలాలు బాగా తగ్గించాలి.

🔴 ఆకు కూరలు, కూరగాయలు విడివిడిగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆకుకూరల్లో కాల్షియం, కొన్నింటిలో అక్సిలేట్‌, కొన్నింటిలో పొటాషియం ఉంటాయి. కలిపితే వాటి స్థాయి పెరిగి రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని