Disha Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు.. చర్యలపై నిర్ణయం హైకోర్టుదే: సుప్రీంకోర్టు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ

Updated : 20 May 2022 13:27 IST

దిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని.. తదుపరి విచారణ, తీసుకునే చర్యలను హైకోర్టు నిర్ణయిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యవహారంపై సిర్పూర్కర్ కమిషన్‌ సవివర నివేదిక ఇచ్చి పలు సూచనలు చేసిందని తెలిపింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

‘‘హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. మేం నివేదిక పంపుతాం.. దీనిపై హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారమిది. నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం.. కేసును సుప్రీంకోర్టు నేరుగా పరిశీలించడం సాధ్యంకాదు. తెలంగాణ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రావాలి’’ ధర్మాసనం సూచించింది. మరోవైపు ఈ విచారణకు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో సైబరాబాద్‌ సీపీగా వ్యవహరించిన వీసీ సజ్జనార్‌ హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని