South central Railway: దసరాకు ఊరెళ్తున్నారా? ప్రత్యేక రైళ్లు.. వాటి రూట్‌లు ఇవే..!

దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల........

Published : 14 Oct 2021 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 22 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పలు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు సంబంధించి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్‌, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? తదితర వివరాలు ఇవిగో..! లాక్‌డౌన్‌ తరువాత రైల్వేలు పూర్వపుస్థాయిలో రైలు సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. రెగ్యులర్‌ సర్వీసులకే స్పెషల్స్‌ అని నడిపిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని