Updated : 26/03/2021 13:59 IST

స్వర్గసీమ మణిదీప్తులు... తులిప్‌ పువ్వులు

అందాలకి తరగని గనులు...

‘‘దేఖ ఏక్‌ ఖ్యాబ్‌ ఏ సిలిసిలే హువే...’’ అంటూ.. అమితాబ్, రేఖ పాడుకునే ఒకానొక ప్రేమగీతం వెనుక తివాచీలా కనువిందు చేసే తులిప్‌ల గురించి తెలిసింది చాలా కొద్దిమందికే. తులిప్‌ అంటే లాటిన్‌ భాషలో తలపాగా అని అర్థం. చూడగానే అందంగానే కాదు ఆహ్లాదాన్ని కలిగించే ఈ పూలు తలలో పెట్టుకోవడానికి పనికిరావు. కానీ, గృహ అలంకరణలో మాత్రం రాజసాన్ని చూపిస్తాయి. అందమైన ఈ తులిప్‌ పుష్పాలకు ఎన్నో  ప్రత్యేకతలున్నాయ్‌.. 

* మూడు రేకలతో అరవిరిసినట్టు ఉండే ఈ మొగ్గలకే గిరాకీ ఎక్కువ. చల్లగా, తేమగా ఉండే నేలలే తులిప్‌ సాగుకి అనువైనవట.వేడి ప్రాంతాల్లో అయితే వసంతకాలం పూతకి అనుకూల సమయం.

* సాధారణంగా దుంపల నుంచి వచ్చిన మొక్కలు ఏడాదిలోపే పూస్తాయి. విత్తనాల ద్వారా అయితే పూతకొచ్చేసరికి దాదాపు నాలుగైదేళ్లు పడుతుంది. అందుకే రైతులు తులిప్‌ సాగుకి ఎక్కువగా దుంపలనే ఎంచుకుంటారు. 

* పదో శతాబ్దం నాటికే వీటిని టర్కీలో సాగుచేశారని, తర్వాత ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలోని అనతోలియా, ఇరాన్, ఇరాక్, చైనా వంటి దేశాలకి విస్తరించాయని శాస్త్రవేత్తల మాట.

* తులిప్‌లలో భిన్నమైన రంగులు కలిగినవి పామిర్, హిందూకుష్‌ పర్వత ప్రాంతాలు, కజకిస్థాన్‌ గడ్డి మైదానాల్లో విరగబూస్తాయి.

* పదహారో శతాబ్దంలో నెదర్లాండ్స్‌లో తులిప్స్‌కి ఆదరణ పెరిగింది. నెదర్లాండ్, ఉత్తర అమెరికా దేశాల్లో తులిప్‌ పూల ఉత్సవాలు ఏటా మే మాసంలో నిర్వహిస్తారు.

* మనదేశంలో కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో తులిప్‌లను సాగుచేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా అరవై రకాల తులిప్‌లను చూడొచ్చు. ఇక్కడ ఏప్రిల్‌ మాసంలో జరిగే ఇందిరా - మహాత్మాగాంధీ తులిప్‌ ఉత్సవం దక్షిణాసియాలోనే అతిపెద్దది.

* తులిప్‌ పూల దుంపలు తియ్యగా ఉండటంతో ఎలుకలు, కుందేళ్లు, ఉడుతలు మట్టిని తవ్వి దుంపలను తినేస్తుంటాయి. 

* తులిప్‌ పువ్వుల్లో అసలైనవి పదిరంగులే. మిగతావన్నీ కృత్రిమ జాతులే.

* తులిప్‌లకు మెజాయిక్‌ అనే వైరస్‌ సోకుతుంది. దీని ప్రభావం వల్ల పువ్వుల సహజ రంగులపై వేరే పూల రంగుల గీతలు రావడం వల్ల వీటి అందం ఇనుమడించడంతో పాటు గిరాకీ కూడా పెరగడంలో కృత్రిమ జాతులను సాగులోకి తెచ్చారు.

* సాధారణంగా తులిప్‌ పూలను బహుమతిగా ఇచ్చేందుకు ఎంచుకుంటారు. తెలుపు రంగు తులిప్‌ స్వచ్ఛతకి, ఎరుపు సిసలైన ప్రేమ, గులాబీ రంగు తులిప్‌ను అభినందనకి, ఆరెంజ్‌ తులిప్‌ శక్తి, కోరికను తెలియజేసేందకు, నీలం ప్రశాంతతకి చిహ్నంగా ఎంచుకుంటారు.

* హంగేరీ, కజకిస్థాన్, నెదర్లాండ్స్, టర్కీ వంటి దేశాలు తమ జాతీయ పుష్పంగా తులిప్‌ను ఎన్నుకున్నాయంటే ఈ తులిప్‌ల ఆకర్షణ, ప్రభావం ఎంత శక్తిమంతమైందో కదా!

- కన్నీడి మనోహర్‌


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని