Updated : 04/06/2021 17:23 IST

TS NEWS: మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం

దుండిగల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద మణికంఠ ప్లాస్టిక్‌ దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణం తెరచే ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యజమాని దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాడు. కాసేపటికే దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలోంచి  పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ప్రమాదంలో సుమారు రూ.10లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని యజమాని అంచనా వేశారు. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని