స్విమ్మింగ్‌పూల్‌లో కారు.. అసలేం జరిగిందంటే!

ఇటీవల స్విమ్మింగ్‌పూల్‌లో కారు మునిగిన దృశ్యానికి సంబంధించి కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ కారు నీటిలోకి ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Published : 07 Jan 2020 00:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల స్విమ్మింగ్‌పూల్‌లో కారు మునిగిన దృశ్యానికి సంబంధించి కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ కారు నీటిలోకి ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. యూఎస్‌లోని ఫ్లోరిడా వెస్ట్‌ పామ్‌ బీచ్‌ పోలీసులు ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక యువతి ఇటీవల కారులో ఫ్లోరిడాలోని ఓ హోటల్‌కు వచ్చింది. ఆమె కారు నడుపుతూ అక్కడికి వచ్చినపుడు అకస్మాత్తుగా దానిపై నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో కారు అక్కడే ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లోకి దూసుకెళ్లి అందులో పడి మునిగిపోయింది. వెంటనే ఆమె కారు వెనక భాగం నుంచి డోర్‌ తెరుచుకుని బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు అందరినీ ఆకర్షిస్తుండటంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘కార్‌ పూలింగ్‌’ అంటూ ఒకరు..  ‘ఈ రోజుల్లో కారు డ్రైవర్లకు కూడా స్విమ్‌సూట్‌ కావాలంటూ’ మరొకరు ఇలా నెటిజన్లు రకరకాలుగా చమత్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని