‘రోదసి యాత్రకు ప్రేయసి కావలెను..’

దినపత్రికల్లో, అంతర్జాలంలో, టీవీల్లో రోజు ఎన్నో రకాల ప్రకటనలు చూస్తూ ఉంటాం. కానీ, జపాన్‌లో వచ్చిన ఈ తరహా ప్రకటన మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. అసలు ఊహకు కూడా అందని ప్రకటన ఇచ్చారు జపాన్‌కు..........

Published : 14 Jan 2020 00:47 IST

టోక్యో: దినపత్రికల్లో, అంతర్జాలంలో, టీవీల్లో రోజు ఎన్నో రకాల ప్రకటనలు చూస్తూ ఉంటాం. కానీ, జపాన్‌లో వచ్చిన ఈ తరహా ప్రకటన మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. అసలు ఊహకు కూడా అందని ప్రకటన ఇచ్చారు జపాన్‌కు చెందిన ఓ బిలియనీర్‌. ఇంతకీ ఆ ప్రకటనేంటి..?ఆయన ఎవరు..? తెలుసా..

జపాన్‌కు చెందిన యుసాకు మిజావా అనే బిలియనీర్‌ ఈ మధ్యే తన గర్ల్‌ఫ్రెండ్‌కి దూరమయ్యాడు. దీంతో ఆయన జీవితాన్ని ఒంటరితనం చుట్టుముట్టింది. ఇక దీన్నుంచి బయటపడడానికి ఆయన మరో ప్రేయసి కావాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ‘ప్రేయసి కావలెను’ అని ప్రకటన కూడా ఇచ్చేశాడు. ‘20ఏళ్ల వయసుండి, జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్న ఓ యువతి కావాలి’ అని అర్హతలు కూడా చెప్పేశాడు. పైగా తన చిరకాల కోరికైన రోదసి యాత్రకు కూడా ఆమెను తీసుకెళ్తాడట. 2023 కల్లా ప్రైవేటు వ్యక్తులను రోదసిలోకి తీసుకెళ్లాలన్న స్పెస్‌ఎక్స్ ప్రాజెక్టుకు యుసాకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాడు. ఈ యాత్రలో తనకు తోడుగా తన కొత్త గర్లఫ్రెండ్‌ని తీసుకెళ్లాలనుకుంటున్నాడట.

అయితే  ఈ ఎంపిక ప్రక్రియని ఓ టీవీ కార్యక్రమంగానూ మలచనున్నారు. ‘ఫుల్‌ మూన్‌ లవర్స్‌’ పేరిట దీన్ని ప్రసారం చేయనున్నారు. దీనిలో పాల్గొనాలకునేవారు.. రోదసి యాత్రకు, దానికి ముందు ఇవ్వబోయే శిక్షణకు సిద్ధంగా ఉండాలని షరతు విధించారు. అలాగే ప్రపంచ శాంతిని కాంక్షించేవారై ఉండాలట. ఈ షోకు దరఖాస్తు చేసుకోవాలనకునేవారికి జనవరి 17 తుది గడువుగా విధించారు. మార్చి చివరి నాటికి మిజావా తన భాగస్వామిని ఎంచుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. రోదసిలో తన ప్రేమను చాటుతూ ప్రపంచ శాంతిని కాంక్షించాలన్నదే తన లక్ష్యమని యుసాకు మిజావా చెబుతున్నాడు. 

జోజో అనే ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ కంపెనీని స్థాపించిన మిజావా గత సంవత్సరమే దీన్ని ఓ ప్రముఖ సంస్థకు విక్రయించారు. కోట్లు ఖర్చు చేసి కళాఖండాలను కొనడం ఈయకున్న మరో ఆసక్తికర అభిరుచి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని