కిలో ఉల్లిపాయలు రూ.22కే ఇస్తాం..

దిల్లీ: కిలో ఉల్లిపాయలు రూ.22కే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడటంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశవాన్‌

Published : 15 Jan 2020 00:49 IST

దిల్లీ: కిలో ఉల్లిపాయలు రూ.22కే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశవాన్‌ తెలిపారు. ఇక నుంచి కిలో ఉల్లి రూ.22కే అందిస్తామని ఆయన ప్రకటించారు. ‘18వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నాం. కేవలం 2000 టన్నుల ఉల్లిపాయలు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక కిలో ఉల్లి రూ.22కే అందిస్తాం’ అని ఆయన తెలిపారు. 

గతేడాది ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగదారుల కంట కన్నీరు తెప్పించింది. కొన్ని ప్రాంతాల్లో రూ.100 నుంచి రూ.200 వరకు ఉల్లి ధర పలికింది. ఆ సమయంలో టర్కీ, ఈజిప్ట్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి 10వేల టన్నులకు పైగా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. ఉల్లి ధరల పెరుగుదల కారణంగా గత నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.35గా నమోదైంది. అటు టోకు ద్రవ్యోల్బణం కూడా ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉల్లి ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని