ఈ స్టేషన్‌కు రూ.20 ఆదాయం

ప్రధాని నరేంద్రమోదీ ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్‌లో కేవలం ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్‌కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. ఇంతకీ అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఒడిశాలోని బొలంగిర్‌ జిల్లాలోని బిచ్చుపాలిలో ఈ రైల్వేస్టేషన్‌ ఉంది. దాదాపు రూ.115కోట్లు

Published : 17 Jan 2020 00:10 IST

కేవలం ఇద్దరే ప్రయాణికులు..!

బిచ్చుపాలి: ప్రధాని నరేంద్రమోదీ ఏడాది క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్‌లో కేవలం ఇద్దరే ప్రయాణికులు ఉన్నారు. ఆ స్టేషన్‌కు వస్తున్న ఆదాయం రూ.20 మాత్రమే. ఇంతకీ అది ఎక్కడుందా అని అనుకుంటున్నారా? ఒడిశాలోని బొలంగిర్‌ జిల్లాలో బిచ్చుపాలిలో ఈ రైల్వేస్టేషన్‌ ఉంది. దాదాపు రూ.115కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వేలైన్‌ వేశారు. గతేడాది జనవరి 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్‌ ప్రారంభమైంది. 

బొలాంగిర్‌-బిచ్చుపాలి మధ్య 16.8కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ వేశారు. ఎప్పుడు చూసినా ఈ రైల్వే స్టేషన్‌ ఖాళీగా కనిపిస్తుంది. అసలు ఈ రైల్వేస్టేషన్‌ ఆదాయమెంత అంటూ బొలాంగిర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సహచట్టాన్ని ఆశ్రయించారు. దీనికి సంబల్‌పూర్‌ డివిజన్‌ ఆఫ్ ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే సమాధానం ఇచ్చింది. రైల్వే స్టేషన్‌కు ఇద్దరే ప్రయాణికులు ఉన్నారని వారి ద్వారా రోజుకు రూ.20 ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే.. రైల్వేస్టేషన్‌ నిర్వహణ ఖర్చులు మాత్రం చెప్పలేదు. రూ.115కోట్లు ఖర్చు చేసి ఈ ట్రాక్‌ వేశారు. సోనేపూర్‌ రైల్వేలైన్‌కు దీన్ని కనెక్ట్‌ చేస్తే ఈ స్టేషన్‌ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి జేపీ మిశ్రా తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని