మేడారం జాతరకు ప్రత్యేక ప్యాకేజీ: శ్రీనివాస్‌ గౌడ్‌

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శ్రీనివాస్‌ గౌడ్‌ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను...

Published : 25 Jan 2020 00:33 IST

హైదరాబాద్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శ్రీనివాస్‌ గౌడ్‌ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ చేపడుతున్న పనుల పురోగతిపై హరిత హోటల్‌లో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. మేడారం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మేడారం వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి అమ్మల దర్శనంతో పాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. జంపన్నవాగు, చిలకలగుట్ట వద్ద జరుగుతున్న పనులను మంత్రులు పరిశీలించారు. పారిశుద్ధ్య పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్లాస్టిక్‌ రహితంగా మేడారం జాతర..: ఎర్రబెల్లి

మేడారం జాతరను ప్లాస్లిక్‌ రహితంగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జాతరలో ప్లాస్టిక్‌ వాడకుండా భక్తులు సహకరించాలని మంత్రి కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కుటుంబసమేతంగా ఆహ్వానిస్తామని చెప్పారు. మేడారంలో విధులు నిర్వహించే అధికారులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని