ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్‌కు 90పైసలు చొప్పున పెంచింది. 500 యూనిట్లు పైబడిన వారికి గతంలో రూ.9.05పైసలుగా ఉండగా.. ప్రస్తుతం రూ.9.95పైసలుగా టారిఫ్‌

Updated : 10 Feb 2020 15:28 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలను పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 500 యూనిట్లు పైబడిన వారికి యూనిట్‌కు 90పైసలు చొప్పున పెంచింది. 500 యూనిట్లు పైబడిన వారికి గతంలో రూ.9.05పైసలుగా ఉండగా.. ప్రస్తుతం రూ.9.95పైసలుగా టారిఫ్‌ నిర్ణయించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు భారం కార్పొరేట్‌ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1.35లక్షల గృహ వినియోగదారులపై పడనుంది.

సబ్సిడీ తగ్గించే మార్గాలను అన్వేషిస్తాం..

హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లోని సింగరేణి భవన్‌లో ఏపీ ఈఆర్సీ ఛైర్మన్‌ సీవీ నాగార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి రూ.14,349.07 కోట్ల ఆదాయం అవసరమవుతుందని అంచనావేసినట్లు చెప్పారు. ఈలోటును భర్తీ చేసేందుకు విద్యుత్‌ ఛార్జీలు పెంచినట్లు వెల్లడించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలపై రూ.13 00 కోట్ల భారం పడుతుందని తెలిపారు. వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటు రూ.10,060.63 కోట్లుగా నిర్థారించినట్లు వెల్లడించారు. వ్యవసాయ వినియోగదారులకు రూ.8,353.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపామన్నారు. రాష్ట్రంలో 9,500 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉందని, అందువల్లే..ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. ఈసారి వ్యవసాయానికి పక్కా ప్రణాళిక రూపొందించామని, ప్రభుత్వ పాలసీ ప్రకారం రైతులకు 9గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు. ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందని, క్రమంగాసబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామన్నారు. లోటు పాట్లు ఉంటే వచ్చే ఏడాది సరిదిద్దుకుంటామని
నాగార్జునరెడ్డి వివరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని