తుపాను ఎఫెక్ట్‌.. విమానం రికార్డు..!

యూకేలోని భయంకరమైన తుఫానును సైతం అనుకూలంగా మార్చుకున్న ఓ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది. తుఫాను గాలులను ఉపయోగించుకుని న్యూయార్క్‌ నుంచి లండన్‌కు 4 గంటల 56 నిమిషాల్లోనే వేగంగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Published : 11 Feb 2020 00:43 IST

లండన్: యూకేలోని భయంకరమైన తుపాను గాలులను అనుకూలంగా మార్చుకున్న ఓ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూయార్క్‌ నుంచి లండన్‌కు ( 5,585 km) దూరాన్ని 4 గంటల 56 నిమిషాల్లోనే వేగంగా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆన్‌లైన్‌ విమాన ట్రాకింగ్‌ సర్వీస్‌ ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ 747 విమానం శనివారం సాయంత్రం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన అనంతరం ఆ విమానం యూకేలోని ‘సియారా’ తుపాను గాలుల్ని అనుకూలంగా మలచుకుని కేవలం 4గంటల 56 నిమిషాల్లో లండన్‌ విమానాశ్రయాన్ని చేరుకుంది. గతంలో నార్వే ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఈ మార్గాన్ని 5.13 గంటల్లోనే పూర్తి చేసి రికార్డు నెలకొల్పగా... ప్రస్తుతం బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ విమానం దాన్ని బ్రేక్‌ చేసినట్లయింది. బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ చేరుకున్న కొద్ది క్షణాలకే వర్జిన్‌ అట్లాంటిక్‌ ఎయిర్‌బస్‌ ఏ350 కూడా  చేరుకుంది. 

ఏదేమైనప్పటికీ ఈ తుపాను ఎదురుగాలుల ప్రభావం వల్ల యూఎస్‌కు వెళ్లే విమానాలు రెండున్నర గంటలు ఆలస్యంగా అవుతున్నాయి. మరోవైపు యూకేలో ‘సియారా’ తుపాను ప్రభావంపై వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు అక్కడి వార్తా పత్రికలు ప్రచురించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని