‘రెయిన్బో స్నేక్’.. 50ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
‘రెయిన్బో స్నేక్’ పాము జాతుల్లో ఇదో అరుదైన జాతి. దీని శరీరంపై రెయిన్‌బోలోని రంగులు మిళితమై ఉంటాయి. అంతటి అరుదైన పాము ఇటీవల ఫ్లోరిడాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఒర్లాండో: ‘రెయిన్బో స్నేక్’ పాము జాతుల్లో ఇదో అరుదైన జాతి. దీని శరీరంపై విభిన్న రంగులు మిళితమై ఉంటాయి. అంతటి అరుదైన పాము ఇటీవల ఫ్లోరిడాలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్లోరిడా ఫిష్, వైల్డ్‌లైఫ్ పరిశోధనా కేంద్రం ఫేస్బుక్లో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రేసీ కాథెన్ అనే వ్యక్తి ఇటీవల ఒకాలా జాతీయ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ విభిన్న రంగుల్లో ఉన్న నాలుగు అడుగుల పొడవైన పామును అతడు గుర్తించాడు. అతడు తీసిన ఫొటోలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని గుర్తించిన నిపుణులు ఆ పామును రెయిన్బో స్నేక్‌గా నిర్ధరించారు. ఫ్లోరిడాలో దాదాపు 50ఏళ్ల తర్వాత ఈ జాతి మళ్లీ కనిపించినట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు. ఇది విష రహితమైనదని చెప్పారు. అవి జలచర జీవులని, ఎక్కువగా నీటిలో సంచరిస్తుంటాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా