సమాజానికి కొంత తిరిగివ్వండి: శైలజాకిరణ్‌

డిజిటల్‌ యుగంలో సాంకేతికత వేగంగా మారుతోందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. తదనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని...

Updated : 29 Feb 2020 16:42 IST

గుంటూరు: డిజిటల్‌ యుగంలో సాంకేతికత వేగంగా మారుతోందని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. తదనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్‌.వి.ఆర్‌.జె.సి. కళాశాల 35వ వార్షికోత్సవానికి ఆమె హాజరయ్యారు. చదువులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కొత్తగా ఆలోచించే వారికే మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. స్మార్ట్‌ ఇండియా లాంటి కార్యక్రమాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పారు. అలోచనా పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలని, సాంకేతిక రంగంలో సరికొత్త పరిజ్ఞానాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. తక్కువ వ్యయంతో ప్రజలకు ఉపయోగపడే సాంకేతికత అవసరమని ఆమె గుర్తు చేశారు. సమష్టిగా ఆలోచించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతూ.. మనకున్న దానిలో సమాజానికి తిరిగి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని