అలుపు లేని 85 ఏళ్ల యువకుడి పరుగు

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులన్నారు శ్రీశ్రీ. మరికొంత మందేమో వృద్ధ్యాప్యంలోనూ యువకులేనని నిరూపిస్తున్నారు. దీనికి కృష్ణా జిల్లాకు చెందిన పెద్ద మనిషి పరుగులే సాక్ష్యం.

Published : 01 Mar 2020 23:51 IST

కృష్ణా: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులన్నారు శ్రీశ్రీ. మరికొంత మందేమో వృద్ధ్యాప్యంలోనూ యువకులేనని నిరూపిస్తున్నారు. దీనికి కృష్ణా జిల్లాకు చెందిన పెద్ద మనిషి పరుగులే సాక్ష్యం. 85 ఏళ్ల వయస్సులోనూ పరుగు పందెంలో పతకాలు సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

అతనే కృష్ణా జిల్లా కోడూరు మండలం పిట్లలంకకు చెందిన రామస్వామి. 19 యేళ్ల వయస్సులో మిలిటరీలో చేరారు. ఉద్యోగ రీత్యా రామస్వామి వివిధ రాష్ట్రాల్లో పనిచేసి 1993లో పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ ఆయన మిలిటరీ క్రమశిక్షణ వీడలేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక తనకు ఇష్టమైన పరుగు పందెంలో సాధన చేస్తూ ఉండేవాడు. తన పొలం సాగు చేసుకుంటూనే పరుగు పందెంలో పాల్గొనేవాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక జాతీయ పతకాలను సాధించాడు. ఎప్పుడంటే అప్పుడు పరుగు పోటీకి రామస్వామి సై అంటున్నారు. అవకాశం వచ్చిందే ఆలస్యం పరుగు పందెంలో పతకాలు పట్టుకొస్తున్నారు. 

ఆరోగ్యకరమైన జీవన విధానం, మితాహారం, తగిన వ్యాయామంపై గ్రామంలోని యువతకు రామస్వామి అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే అంతర్జాతీయ స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని రామస్వామి చెబుతున్నారు. మరి పరుగులో అలుపు లేని ఈ 85 ఏళ్ల యువకుడు నేటి యువతరానికి ఆదర్శప్రాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని