ఈ బామ్మ ఇంగ్లిష్‌ ఇరగదీస్తోంది

ఇప్పుడంటే గల్లీకో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ఉంది. చాలామంది తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నారు. వాళ్ల పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కారణం పిల్లలంత

Published : 03 Mar 2020 00:34 IST

భువనేశ్వర్‌(ఒడిశా): ఇప్పుడంటే గల్లీకో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ఉంది. చాలామంది తమ పిల్లల్ని ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివిస్తున్నారు. వాళ్ల పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఎందుకంటే.. పిల్లలంత ఇంగ్లిష్‌ వాళ్లకు వస్తుందో రాదోనన్న భయం. కానీ, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ బామ్మ ఏమాత్రం తడబాటు లేకుండా అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ ఇరగదీస్తోంది. మహాత్మా గాంధీ గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తోంది. ‘మహాత్మా గాంధీ హిందూ, ముస్లింలను సమానంగా ప్రేమించేవారు. ఆయన సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. చాలా సాదాసీదాగా ఉండేవారు. ఎక్కువగా మేక పాలు తాగేవారు. ఆయన మన దేశానికి జాతిపిత. మహాత్మాగాంధీ అహింసను ఇష్టపడేవారు’ అని ఆమె ఇంగ్లిష్‌లో చెప్పుకొచ్చింది.

ఈ బామ్మ ఇంగ్లిష్‌ మాట్లాడుతున్న ఓ వీడియోను భువనేశ్వర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ బొత్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. మీరు ఈమె ఇంగ్లిష్‌కు ఎన్ని మార్కులు ఇస్తారు..? అని ప్రశ్నించగా.. చాలామంది నెటిజన్లు దానికి స్పందించారు. 10కి 10 మార్కులిస్తామని బదులిచ్చారు. మరికొంతమంది మాత్రం ఆమె టాలెంట్‌ను లెక్కించే అంత స్థాయి మనలో ఎవరికీ లేదని ఆ వృద్ధురాలిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంగ్లిష్‌ బాగా మాట్లాడటంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌కు పోటీనిచ్చే వ్యక్తి ఇప్పుడు మనకు దొరికారంటూ పేర్కొంటున్నారు. ఈ వీడియోను శశిథరూర్‌కు చేరేలా ఆయనను ట్యాగ్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. ఇప్పుడు ట్విటర్లో ఈ బామ్మ వీడియో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని