మీ సందేశం ఇలా కూడా చెప్పొచ్చు..

ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరినొకరు ఛాలెంజ్‌లు విసురుకోవడం సర్వసాధారణమైంది. అదీ టిక్‌టాక్‌లో అయితే మరీ ఎక్కువైంది. 

Updated : 22 Dec 2022 14:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరినొకరు ఛాలెంజ్‌లు విసురుకోవడం సర్వసాధారణమైంది. అదీ టిక్‌టాక్‌లో అయితే మరీ ఎక్కువైంది. అందులో కొన్ని సరదాగా ఉంటే, మరి కొన్ని ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌ తెర మీదకు వచ్చి వైరల్‌గా మారింది. దీని పేరు పేపర్‌ టవల్‌ ఛాలెంజ్‌. ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే... ఓ పేపరు టవల్‌(పెద్ద టిస్యూ పేపరు)లో రహస్య సందేశాలని రాసి, దాన్ని నీళ్లతో నింపిన వాష్‌ బేసిన్‌లో పడేయాలి. అంతే పడిసిన తర్వాత రహస్య సందేశం కనిపిస్తుంది. అయినా ఇదెలా సాధ్యం అనుకుంటురా? పేపరు టవల్‌ని రెండుగా మడిచి, లోపలున్న మడతలో మీ రహస్య సందేశాన్ని రాస్తారు. పేపరు టవల్‌ నీటిలో తడిసినప్పుడు మీ సందేశం కనిపిస్తుంది అంతే. ఇలా ఈ ఛాలెంజ్‌ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో సరదాగా ఒకరినొకరు ఛాలెంజ్‌ విసురుకుంటుండంతో వైరల్‌గా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని