వంశధార కాలువపై కూలిన పురాతన వంతెన

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బైదలాపురం గ్రామానికి సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై ఉన్న పురాతన వంతెన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 1974లో నిర్మించినట్లు స్థానికులు

Published : 14 Mar 2020 12:14 IST

సారవకోట: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బైదలాపురం గ్రామానికి సమీపంలో వంశధార ప్రధాన ఎడమ కాలువపై ఉన్న పురాతన వంతెన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ వంతెనను 1974లో నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. వంతెనపై నుంచి తరచూ గ్రానైట్‌ రాళ్లతో భారీ వాహనాలు రాకపోకలు చేయడమే వంతెన కూలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెన కూలడంతో బైదలాపురం గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, 29న సర్పంచి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులకు అటు ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వంశధార అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని