రేపు పాక్షికంగా ఎంఎంటీఎస్‌ సర్వీసులు

జనతా కర్ఫ్యూ కారణంగా రేపు పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రయాణికులకు

Published : 21 Mar 2020 13:55 IST

హైదరాబాద్‌: జనతా కర్ఫ్యూ కారణంగా రేపు పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా 12 ఎంఎంటీఎస్‌ సర్వీసులు  మాత్రమే నడుపుతామని వెల్లడించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 250కి పైగా ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసినట్లు చెప్పారు. ‘‘అన్ని మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేశాం. ఉదయం 4గంటల నుంచి రాత్రి 10లోపు బయల్దేరే మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు. రైల్వే స్టేషన్ల ప్రాంగణంలోని వెయిటింగ్‌ హాళ్లు, ఫుడ్‌ స్టాల్స్‌ మూసివేస్తాం’’ అని వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని