
Published : 22 Mar 2020 01:46 IST
మనం ఒక్కటేనని చాటిచెప్పాలి:రాజేంద్ర ప్రసాద్
ఇంటర్కెట్ డెస్క్: మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపును ప్రతి పౌరుడు పాటించాలని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కాళ్లు, చేతులు కడుక్కోపోతే.. ఒక వ్యక్తిని ఇంట్లోకే రానివ్వని సంప్రదాయం భారత దేశానిది.. అలాంటిది కరోనా మహమ్మారిని రానిస్తామా అని సందేశంలో వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరి వాళ్ల ఇళ్లలో వారు ఉంటూ వీలైనంత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనమంతా ఒక్కటేనని చాటిచెప్పడానికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో హర్షాతిరేకాలు తెలపాలని ప్రజలను రాజేంద్రప్రసాద్ కోరారు.
Tags :