ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ ఎలా ఉందంటే..!

దేశంలో రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం స్వచ్ఛందంగా కర్ఫ్యూలో భాగమైంది....

Updated : 22 Mar 2020 16:26 IST

విశాఖ: సత్యం కూడలి వద్ద నిర్మానుష్యంగా..

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: రోజురోజూకీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆదివారం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం స్వచ్ఛందంగా కర్ఫ్యూలో భాగమైంది. దీంతో ఎప్పుడూ జనసమూహంతో ఉండే పలు నగరాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్ని డిపోలకే పరిమితమవడంతో జాతీయ రహదారులు బోసిపోయాయి. ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇళ్లకు పరిమితమయ్యారు. రాష్ట్రంలో జనతా కర్ఫ్యూకి సంబంధించిన చిత్రాలివే..


నిర్మానుష్యంగా మారిన విజయవాడ బస్టాండ్‌ ఆవరణ


ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే గుంటూరులోని ప్రధాన రహదారి ఇలా..


విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో..


వాహనాల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారిన రాజమహేంద్రవరంలో జాతీయ రహదారి


జనతా కర్ఫ్యూతో తిరుపతిలో బస్టాండ్‌కే పరిమితమైన బస్సులు


ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో బోసిపోయిన ప్రకాశం బ్యారేజ్‌


బోసిపోయిన అనంతపురంలోని ప్రధాన రహదారి

 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని