విధిగా వారు సమాచారం అందించాలి:ఏపీ డీజీపీ

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారంతా తమ వివరాలను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖకు అందించాలని.. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని

Published : 22 Mar 2020 15:39 IST

విజయవాడ: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారంతా తమ వివరాలను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖకు అందించాలని.. లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రజలు పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా కొవిడ్ లక్షణాలు బయట పడుతున్నాయని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్యశాఖకు విధిగా తమ సమాచారం అందించేలా వారి కుటుంబసభ్యులు సహకరించాలని కోరారు. వైద్యఆరోగ్య శాఖ సూచనల మేరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. దీనివల్ల ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడినవారమవుతామన్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని డీజీపీ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు విధిగా నిబంధనలు, సూచనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పరిశీలిస్తారని డీజీపీ గౌతం సవాంగ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని