ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు లాక్‌ చేయొద్దు: కేంద్రం

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తు్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను లాక్‌ చేయెద్దని కేంద్ర...

Updated : 25 Mar 2020 11:49 IST

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను లాక్‌ చేయొద్దని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సూచనలు జారీ చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు వాణిజ్య మంత్రిత్వశాఖలోని అంతర్గత వాణిజ్య, పరిశ్రమల ప్రోత్సాహక (డీపీఐఐటీ)విభాగం కార్యదర్శి గురుప్రసాద్‌ మహోపాత్ర లేఖ రాశారు.

పలు రాష్ట్రాల్లో ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లు మూసివేస్తున్నట్లు వస్తున్న సమాచారంపై మహాపాత్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార సరఫరా గొలుసును నిర్వహించడానికి ఈ యూనిట్లు నడుస్తూ ఉండాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు. సెక్షన్‌ 144 అమలవుతున్నా..కఠినమైన భద్రత, పరిశుభ్రత ప్రమాణాల ప్రకారం తయారీకి అనుమతి ఉందని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. పంపిణీ, అమ్మకాలు, డెలివరీ వ్యవస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా ఆపొద్దని మహాపాత్ర రాష్ట్రాలను కోరారు. కిరాణా, ఔషధాలు, నగదు పంపిణీ సంస్థల ఉద్యోగులకు ఈ కాలంలో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం అంతర్రాష్ట్ర సరఫరాకు ఎటువంటి పరిమితి ఉండదని, అందువల్ల ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని రాష్ట్రాలను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని