Published : 29/03/2020 18:26 IST

ఐసోలేషన్‌ వార్డుల్లో సేవలు అద్భుతం

కొచ్చిన్‌: కేరళలో కరోనావైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించే కేంద్రాల్లో వైద్య సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని కేరళ దంపతులు అంటున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన రాబిన్‌ దంపతులకు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన వారి అత్తమామల ద్వారా కరోనా వైరస్‌ సోకింది. దీంతో వారితో పాటు రాబిన్‌ దంపతులు అక్కడే ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో చేరారు. 21 రోజులపాటు అక్కడే ఉన్న వారు  కరోనా నుంచి పూర్తిగా కోలుకుని మార్చి 25 తేదిన ఇంటికి చేరారు. అక్కడి వసతులు గురించి రాబిన్‌ వివరిస్తూ.. ఈ వైరస్‌ గురించి వార్తాఛానెళ్లులో భయంకరంగా చూపించడంతో మొదట భయపడ్డామని, అయితే అక్కడి వైద్యులు తమకు కరోనా పట్ల పూర్తి అవగాహన కల్పించడంతో భయాలు తొలగిపోయాయన్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులనగానే మనమంతా అక్కడ సరైన సదుపాయాలు ఉండవనే భ్రమలో ఉంటామని, అయితే ఆ ఆసుపత్రిలో ప్రపంచస్థాయి వైద్యాన్ని, వసతులను తమకు కల్పించారని పేర్కొన్నారు. మొదట అందరూ ఇటలీ నుంచి వచ్చిన తన అత్తమామలను దోషులుగా చూశారని, తమ నుంచి ఈ వైరస్‌ కాలనీవాసులకు సోకనందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు కేరళలో 174 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒకరు మృత్యువాతపడ్డారు. 15 మంది కోలుకున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని