ప్రత్యేక జాగ్రత్తలతో పింఛన్ల పంపిణీ

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వాలంటీర్లు...

Published : 01 Apr 2020 11:16 IST

అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల లబ్ధిదారులకు పింఛను పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉదయం 6గంటల నుంచే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ పింఛన్లు పంపిణీ చేశారు. వేలిముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేశారు. ఉదయం 9గంటల కల్లా 65శాతం పింఛన్లు లబ్ధిదారులకు పింపిణీ చేశారు. మొత్తం 59 లక్షల పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని