ట్రూనాడ్‌ పరికరాలతో కొవిడ్‌-19 నిర్ధరణ?

కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో నిర్ధరణ కోసం రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. గతంలో క్షయ వ్యాధి నిర్ధరణ కోసం వినియోగించిన ట్రూనాడ్‌ పరికరాల ద్వారా చర్యలు చేపట్టింది.

Published : 09 Apr 2020 01:46 IST

చిత్తూరు క్షయ నియంత్రణ అధికారితో ముఖాముఖి

చిత్తూరు: కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో నిర్ధరణ కోసం రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. గతంలో క్షయ వ్యాధి నిర్ధరణ కోసం వినియోగించిన ట్రూనాడ్‌ పరికరాల ద్వారా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ట్రూనాడ్‌ పరికరాల పని తీరు, ఫలితాల్లో కచ్చితత్వంపై చిత్తూరు జిల్లా క్షయ నియంత్రణ అధికారి రమేశ్‌తో ముఖాముఖి..

కరోనా వైరస్‌ను ట్రూనాడ్‌ పరికరాలతో  నిర్ధరించవచ్చా..? 
క్షయ నిర్ధరణకు వాడే రసాయనాలు, కరోనా నిర్ధరణకు వినియోగించే రసాయనాలు వేరుగా ఉంటాయి. వీటిని బెంగళూరు నుంచి ప్రయోగాత్మకంగా తీసుకువచ్చాం. ఇప్పటికే కరోనా పాజిటివ్‌, నెగటివ్‌ కేసులను పరీక్షించి, ఫలితాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. ఏపీ ప్రభుత్వ సూచన మేరకు ఆర్టీపీసీఆర్‌లో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు కరోనా నిర్ధరణ పరీక్షలపై శిక్షణ సైతం ఇచ్చాం. 

ఈ పరికరాలతో కరోనా నిర్ధరణకు ఐసీఎమ్మార్‌ అనుమతించిందా..?
అనుమతి ఉంది. ఐసీఎమ్మార్‌ నిబంధనల ప్రకారం ఒకసారి పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్‌ వచ్చిన శాంపిల్స్‌ను మరోసారి పరీక్షించేందుకు వైరాలజీ ల్యాబ్‌కు పంపించాలి. నెగటివ్‌ వచ్చిన కేసును ఇక్కడే నిర్ధరించవచ్చు. 
 మరిన్ని వివరాలు కింది వీడియోలో..

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని