భారత్‌లోనే ఉంటామంటున్న అమెరికన్లు

భారత్‌లోనే ఉంటామంటున్న అమెరికన్లు

Published : 13 Apr 2020 18:49 IST

కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకు విముఖత

న్యూదిల్లీ: భారత్‌లో ఉంటున్న అమెరికన్లు ఇక్కడే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా నేపథ్యంలో ఇండియాలోని దాదాపు 50 వేల మందికిపైగా అమెరికా జాతీయులను తమ దేశానికి తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మరోవైపు ఎక్కువ శాతం అమెరికన్లు స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపుతుండటం గమనార్హం. అగ్రరాజ్యం ప్రస్తుతం కరోనాతో కకావికలమవుతోన్న విషయం తెలిసిందే. 
ముమ్మరం చేసిన వివిధ దేశాలు.. 
‘అమెరికాకు తీసుకెళ్లేందుకు గత వారాంతంలో మా సిబ్బంది దాదాపు 800 మందికి ఫోన్‌ చేశారు. వారిలో కేవలం 10 మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. ఈ సంఖ్యే వారి అయిష్టతను స్పష్టం చేస్తోంది. భారత్‌లో ఇంకా 24 వేల మంది అమెరికన్ల ఆచూకీని కనుగొంటున్నామ’ని ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. గత వారాంతంలో 444 మంది ఆస్ర్టేలియన్లను అక్కడి ప్రభుత్వం భారత్‌ నుంచి మెల్‌బోర్న్‌కు తరలించింది. యూకే సైతం ఇక్కడి నుంచి మరింత మందిని తమ దేశానికి తరలించేలా అదనంగా మరో 12 చార్టర్‌ విమానాలను నడిపించాలని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని