ఆ బుడతడి పేరు ‘శానిటైజర్‌’

అప్పుడే పుట్టిన ఒక పసివాడికి ‘శానిటైజర్ ’ అని పేరుపెట్టిన విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  రాష్ట్రంలోని షహారాన్‌పూర్‌ జిల్లా విజయ్‌విహార్‌ ప్రాంతానికి చెందిన

Updated : 22 Dec 2022 17:14 IST

 

లఖ్‌నవూ: అప్పుడే పుట్టిన ఒక పసివాడికి ‘శానిటైజర్ ’ అని పేరుపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  రాష్ట్రంలోని షహారాన్‌పూర్‌ జిల్లా విజయ్‌విహార్‌ ప్రాంతానికి చెందిన ఓంవీర్‌సింగ్‌, మోనిక దంపతులు. మోనికకు ఆదివారం నొప్పులు రావడంతో దగ్గరలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న భర్త ఓంవీర్‌ బుడతడి పేరు ‘శానిటైజర్‌’గా నామకరణం చేస్తున్నానని చెప్పగానే అక్కుడున్న నర్సులంతా చిరునవ్వులు చిందించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నవేళ పుట్టిన కారణంగా తన కుమారుడికి కరోనాను ఓడించే శక్తి ఉన్నట్టు నమ్ముతున్నానని అందుకే శానిటైజర్‌ అని పేరు పెట్టినట్టుగా చమత్కరించాడు. బంధువులందరికి ఫోన్‌ చేసి లాక్‌డౌన్‌ ముగిశాక ఘనంగా వేడుక చేద్దామంటూ చెప్పడం కొసమెరుపు.  గతంలో ప్రధాని మోదీ జనతాకర్ప్యూ ప్రకటించిన రోజు గోరఖ్‌పూర్‌లో తల్లి ఒక ఆడబిడ్డ జన్మించగా తల్లిదండ్రులు ‘కరోనా’గా నామకరణం చేశారు. మరోఘటనలో లాక్‌డౌన్‌ ప్రకటించిన ఒక వారానికి డియరియా జిల్లాలో మగబిడ్డ జన్మించగా ‘లాక్‌డౌన్‌’ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రామ్‌పూర్‌ ప్రాంతంలో అపుడే జన్మించిన ఒక మగబిడ్డకు ‘కొవిడ్‌’ అని పేరుపెట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని