సర్పంచుల సంఘం రూ.6.37కోట్ల విరాళం

కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం సీఎం సహాయనిధికి రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం తమ నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మొత్తం రూ.6.37 కోట్లు విరాళమిస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ

Updated : 18 Apr 2020 16:39 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం సీఎం సహాయనిధికి రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం తమ నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మొత్తం రూ.6.37 కోట్లు విరాళమిస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లికి లేఖను అందించింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లను మంత్రి అభినందించారు.

అంతకుముందు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు తదితర ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద రాష్ట్రంలో 1000 కి.మీ మేర పనుల కోసం రూ.620 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అనుమతులు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి మూడో ఫేజ్ కింద కేటాయించిన 2,427 కి.మీతోపాటు మరో 1427 కి.మీ మేర పనులకు కూడా అనుమతుల కోసం అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 6 లక్షల మంది పనిచేయడం శుభపరిణామమన్నారు. వీరి సంఖ్య మరో వారం రోజుల్లో పది లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధిహామీ కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు మంచినీరు, మాస్కులు అందించాలని, వారంతా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎర్రబెల్లి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని