కొవిడ్ ఆసుపత్రికి ఎంపీ రేవంత్‌ ₹50లక్షలు

 తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కొవిడ్ ఆసుపత్రికి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల......

Published : 29 Apr 2020 17:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కొవిడ్ ఆసుపత్రికి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇచ్చారు. మల్కాజ్‌గిరి  కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. గచ్చిబౌలిలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి నిర్మించిన విషయం తెసిందే. ఈ ఆసుపత్రికి సివరేజ్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారు. ఈ కారణంగా మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళుతోంది. అక్కడ విద్యార్థులు, సిబ్బంది ఈ సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి చొరవ చూపుతూ ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయిస్తూ కలెక్టర్‌కు లేఖ అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, నందిగంటి శ్రీధర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని