పాక్‌ నకిలీ ఆరోగ్య సేతు యాప్‌తో జాగ్రత్త!

నకిలీ ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా చరవాణులను హ్యాక్‌ చేసేందుకు కొన్ని పాకిస్తానీ ఏజెన్సీలు కుట్ర పన్నుతున్నాయని.. ఈ విషయంలో భారత సైనిక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పొరుగు దేశం నుంచి వివిధ నకిలీ యాప్‌లు భారత మిలిటరీ వర్గాలకు చెందిన వాట్సాప్‌ గ్రూప్స్‌లోకి వస్తున్నాయని చెప్పారు....

Published : 01 May 2020 01:24 IST

సైనిక సిబ్బందికి ఉన్నతాధికారుల హెచ్చరిక

దిల్లీ: నకిలీ ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా చరవాణులను హ్యాక్‌ చేసేందుకు కొన్ని పాకిస్థానీ ఏజెన్సీలు కుట్ర పన్నుతున్నాయని ఈ విషయంలో భారత సైనిక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పొరుగు దేశం నుంచి వివిధ నకిలీ యాప్‌లు భారత మిలిటరీ వర్గాలకు చెందిన వాట్సాప్‌ గ్రూప్స్‌లోకి వస్తున్నాయని చెప్పారు. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లో భారతీయ పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ఇక్కడి వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇటీవల అనోష్క చోప్రా పేరు మీద ఓ పాక్‌ ఇంటెలిజెన్స్‌ బృందం భద్రతా సిబ్బందికి ప్రమాదకార యాప్‌ను పంపినట్లు తెలిపారు. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి లేదా గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని