కొవిడ్‌ వ్యాక్సిన్‌ డిజైన్‌ బృందంలో కడప శాస్త్రవేత్త

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల బృందంలో కడప జిల్లా నందలూరు మండలం కోనాపురానికి...

Published : 01 May 2020 10:09 IST

నందలూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల బృందంలో కడప జిల్లా నందలూరు మండలం కోనాపురానికి చెందిన శాస్త్రవేత్త ఉప్పలపాటి లక్ష్మీనరసయ్య  కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ విశ్వవిద్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న పరిశోధకుడు జోనాథన్‌ గెర్షోని నేతృత్వంలోని బృందం ఇటీవల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డిజైన్‌ను రూపొందించింది. దీనికి మార్చి నెలలో అమెరికా పేటెంట్‌ కూడా ఇచ్చింది. గెర్షోని బృందంలోనే లక్ష్మీనరసయ్య ఉన్నారు. సాధారణంగా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ తయారీకి రెండేళ్లు పడుతుందని, తమ బృందం దీన్ని రెండు నెలల్లోనే సాధించిందని టెల్‌అవీవ్‌ నుంచి లక్ష్మీనరసయ్య ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని