శ్రామిక్‌ రైలులో వలసకూలీల అదృశ్యం

సూరత్‌ నుంచి హరిద్వార్‌కు వలసకార్మికులతో వస్తున్న శ్రామిక్‌రైలులోని కొందరు అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన శ్రామిక్‌రైలు మే 12న 1340 మందితో

Published : 14 May 2020 19:42 IST

హరిద్వార్‌: సూరత్‌ నుంచి హరిద్వార్‌కు వలసకార్మికులతో వస్తున్న శ్రామిక్‌రైలులోని కొందరు అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన శ్రామిక్‌రైలు మే 12న 1340 మందితో సూరత్‌ నుంచి హరిద్వార్‌కు బయలుదేరింది. అయితే గమ్యస్థానం చేరేటప్పటికి సుమారు 167 మంది వలసకార్మికులు అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించారు. హరిద్వార్‌స్టేషన్‌లో  1173 మంది కార్మికులే రైలు దిగినట్టు హరిద్వార్‌ కలెక్టర్‌ సి.రవిశంకర్‌ పేర్కొన్నారు. సూరత్‌లో వలసకార్మికులు రైలు ఎక్కిన తర్వాత ఎక్కడా ఆపకుండా రైలు ప్రయాణించిందని పేర్కొన్న అధికారులు ఈ ఘటన ఎలా జరిగింది అన్నదానిపై విచారణ చేస్తున్నారు. ఇలా జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తునట్టు పేర్కొన్న కలెక్టర్ రవిశంకర్‌ విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. వలసకార్మికులను శ్రామిక్‌రైలులో తరలించడానికి అధికారులు అవసరమైన జాగ్రత్తచర్యలు తీసుకుంటున్నారు. రైలు ఎక్కేముందు వారికి కొవిడ్‌-19 పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. గమ్యస్థానం చేరాక కూడా పరీక్షలు చేస్తున్నారు. ఇపుడు ఈ ఘటన జరగడంతో అక్కడి అధికారులు తలలు పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని