7 రోజుల్లోనే లక్ష మంది తరలింపు: ద.మ.రైల్వే

శ్రామిక్‌ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు దక్షిణమధ్య రైల్వే (ద.మ.రైల్వే) వెల్లడించింది. మే 1 నుంచి 23 వరకు 2,41,768 మందిని స్వస్థలాలకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు ద.మ.రైల్వే

Published : 24 May 2020 17:07 IST

హైదరాబాద్‌: శ్రామిక్‌ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు దక్షిణమధ్య రైల్వే (ద.మ.రైల్వే) వెల్లడించింది. మే 1 నుంచి 23 వరకు 2,41,768 మందిని స్వస్థలాలకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు ద.మ.రైల్వే ప్రకటన విడుదల చేసింది. ద.మ.రైల్లే జోన్ పరిధిలో 16 రోజుల్లో మొదటి లక్ష మందిని చేరవేర్చినట్లు వెల్లడించింది. తర్వాత లక్ష మంది ప్రయాణికులను కేవలం 7 రోజుల్లోనే తరలించినట్లు తెలిపింది. జోన్ పరిధిలో తెలంగాణ నుంచి 1.50 లక్షలు, ఏపీ నుంచి 65 వేలకు పైగా ప్రయాణికులు శ్రామిక్‌ రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి వరకు జోన్‌ పరిధిలో 196 శ్రామిక్‌ రైళ్లను నడపగా.. శనివారం ఒక్కరోజు కేవలం 12 గంటల వ్యవధిలో 43 రైళ్లను నడిపినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని