‘కింగ్‌ కోబ్రా’కు స్నానం..వీడియో వైరల్‌

సాధారణంగా పాము కనబడితే మనలో సన్నగా వణకు మొదలవుతుంది. అలాంటిది సుమారు 14  అడుగులున్న కింగ్‌ కోబ్రా దగ్గరకు వెళ్లి, దానికి స్నానం..

Updated : 26 May 2020 05:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా పాము కనబడితే మనలో సన్నగా వణకు మొదలవుతుంది. అలాంటిది సుమారు 14  అడుగులున్న కింగ్‌ కోబ్రా దగ్గరకు వెళ్లి, దానికి స్నానం చేయించడమంటే..అమ్మో ఇంకేమన్నా ఉందా..! అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోక తప్పదు. సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్న  ఈ వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత్‌నందా ఆదివారం తన ట్విట్టర్‌ఖాతాలో  పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి కింగ్‌ కోబ్రాకు దగ్గర్లోని కుళాయి నీటిని బకెట్‌లో పట్టి స్నానం చేయిస్తున్నాడు. కోబ్రా సైతం ఆ స్నానాన్ని ఆస్వాదిస్తూ సేద తీరడం గమనార్హం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి కోబ్రా తలపై నిమురుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని సుశాంత్‌నందా ప్రస్తావిస్తూ ఆ వ్యక్తి సర్పాలను నియంత్రించడంలో అనుభవం  ఉన్నవాడని, దయచేసి ఎవ్వరూ ఇటువంటివి అనుకరించవద్దని, ఈ కృత్యం అత్యంత ప్రమాదకరమని విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి!  

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని