అంతరిక్షంలో ఆటబొమ్మ! ఎలావెళ్లిందంటే..
క్రూ డ్రాగన్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఓ విశేషం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన వ్యోమగాములు డగ్ హర్లీ, బాబ్ బెంకెన్‌లు అంతరిక్ష నౌక క్రూ డ్రాగన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన సంగతి తెలిసిందే. దీనితో మానవులను రోదసిలోకి తరలించిన తొలి ప్రైవేటు సంస్థగా అమెరికన్ సాంకేతిక దిగ్గజం స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. ఈ అంతరిక్ష యాత్రకు సంబంధించిన వీడియోలను ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షించారు. అయితే, దీనిలో ఓ విశేషం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోల్లో కనబడిన ఓ డైనోసార్ బొమ్మ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
దీనిని గురించి వ్యోమగాముల్లో ఒకరైన బెంకెన్ మాట్లాడుతూ... ‘జీరో గ్రావిటీ ఇండికేటర్’గా వాడేందుకు దానిని తన కుమారుడి వద్ద నుంచి తీసుకున్నానని వివరణ ఇచ్చారు. అంతరిక్ష ప్రయాణాల్లో ఆటబొమ్మలను తీసుకెళ్లటం ఇదే తొలిసారి కాదు. మార్చి 2019లో జరిగిన ప్రయోగాత్మక మానవ రహిత క్రూ డ్రాగన్ అంతరిక్ష యాత్రలో...భూగోళం ఆకారంలో ఉన్న ఓ స్టఫ్డ్ టాయ్‌ని ఉపయోగించినట్టు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్