ఒకే ఐఎంఈఐతో దేశంలో 13,500 ఫోన్లు

మొబైల్‌ ఫోన్లను గుర్తించేందుకు ఉపయోగించే అంతర్జాతీయ  మొబైల్‌ గుర్తింపు సంఖ్య ఐఎంఈఐకు సంబంధించి....

Updated : 06 Jun 2020 12:49 IST

మేరట్‌‌(ఉత్తర్‌ప్రదేశ్‌) : మొబైల్‌ ఫోన్లను గుర్తించేందుకు ఉపయోగించే అంతర్జాతీయ  మొబైల్‌ గుర్తింపు సంఖ్య ఐఎంఈఐకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లో మొబైల్‌ కంపెనీల నిర్లక్ష్యం బయటపడింది.  ఒకే ఐఎంఈఐతో దేశంలో  13,500 మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తేలింది. మేరట్‌‌ ఎస్పీ అఖిలేష్‌సింగ్‌ మరమ్మతుల తర్వాత కూడా తన ఫోన్‌ పనిచేయకపోవడంతో పరిశీలన కోసం సైబర్‌ విభాగానికి అందించారు. ఆ మొబైల్‌ను పరిశీలించిన యూపీ సైబర్‌ విభాగం  అదే ఐఎంఈఐతో 13,500 ఇతర మొబైల్‌ ఫోన్లు ఉన్నట్లు గుర్తించింది.  ఇలా ఉండడం వల్ల  నేరగాళ్లు స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకునే  ప్రమాదం ఉందని యూపీ పోలీసులు తెలిపారు.  ఈ ఘటనకు సంబంధించి మొబైల్‌ తయారీ కంపెనీ, సర్వీసు కేంద్రం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు