ఆ రెండు లక్షణాలున్నా కరోనా పరీక్ష చేయాలి

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 3లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 పరీక్షలకు ప్రామాణికంగా మరో రెండు లక్షణాలను

Updated : 12 Aug 2022 15:27 IST

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 3లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 పరీక్షలకు ప్రామాణికంగా మరో రెండు లక్షణాలను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేర్చింది. రుచి, వాసన సామర్థ్యాలను కోల్పోయే అంశాలను కూడా ఇప్పుడు కరోనా లక్షణాల జాబితాలో చేర్చారు. పలువురు కరోనా రోగులు రుచి, వాసనను కోల్పోయినట్లు పేర్కొంటున్న దరిమిలా ఈ అంశం ఆధారంగా కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. 

కరోనా బారిన పడ్డవారు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, గొంతు నొప్పి, కఫం, డయేరియా తదితర సమస్యలతో బాధపడుతుంటే కరోనా సోకినట్లు గుర్తించవచ్చని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇలా 13 రకాల లక్షణాల్లో ఏవి ఉన్నా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఇప్పుడు ఈ జాబితాలో రుచి, వాసన చూసే సామర్థ్యం లేకపోవడం కూడా వచ్చి చేరడంలో కరోనా లక్షణాల సంఖ్య 15కు చేరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని