Published : 24/06/2020 21:08 IST

అన్ని యూనివర్సిటీల పరీక్షలు రద్దు?

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించడంతో అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పరీక్షలు రద్దుకు యూజీసీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

కరోనా ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మానవ వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌లో కూడా మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో పాటు, అన్ని రకాల సాంకేతిక ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ కూడా మార్చే యోచనలో మంత్రిత్వశాఖ ఉంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. పరీక్షల నిర్వహణపై విచారణ నిర్ణయాన్ని  సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ వెల్లడించనుంది. సీబీఎస్‌ఈ నిర్ణయానికి అనుగుణంగా సాంకేతిక విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణపై  మానవ వనరుల శాఖ ప్రకటన చేసే యోచనలో ఉంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని