హైకోర్టులో పీవీపీకి ఊరట

వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విల్లా గొడవకు సంబంధించి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పీవీపీపై

Updated : 01 Jul 2020 10:57 IST

హైదరాబాద్‌: వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. విల్లా గొడవకు సంబంధించి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసు విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పీవీపీ బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈకేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని