పోషణ భారం.. పక్షుల బేరం

ఆయనో పక్షి ప్రేమికుడు. అయిదేళ్లుగా బజిజ్‌, ఆఫ్రికన్‌ ఫిషర్‌, కాక్‌టైల్‌, జావా, ఫించెస్‌ వంటి పలు రకాల పక్షులను సేకరించి ఇంటి వద్దే పెంచుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో తన జీవనోపాధి దెబ్బతిందని, పక్షుల పోషణ భారంగా మారిందని చెబుతున్నారు. చేసేదేమీ లేక స్థానిక పార్కు వద్ద ఆదివారాల్లో

Published : 07 Jul 2020 08:31 IST

ఆయనో పక్షి ప్రేమికుడు. అయిదేళ్లుగా బజిజ్‌, ఆఫ్రికన్‌ ఫిషర్‌, కాక్‌టైల్‌, జావా, ఫించెస్‌ వంటి పలు రకాల పక్షులను సేకరించి ఇంటి వద్దే పెంచుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారితో తన జీవనోపాధి దెబ్బతిందని, పక్షుల పోషణ భారంగా మారిందని చెబుతున్నారు. చేసేదేమీ లేక స్థానిక పార్కు వద్ద ఆదివారాల్లో ఆ పక్షులను విక్రయిస్తున్నట్లు వాపోయారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన అబ్దుల్‌ రషీద్‌ కథ ఇది. టెంట్‌హౌస్‌ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న ఆయన, తను పెంచుతున్న పక్షుల సంరక్షణకు నెలకు రూ.40 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కరోనాతో తన జీవనోపాధే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు