Sweets: 24 క్యారెట్ల పుత్తడితో చేసిన స్వీట్లు.. కేజీ ధర ఎంతంటే?

ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్‌’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో దీనిని తయారు చేయడం విశేషం.

Updated : 02 Nov 2021 11:19 IST

ముంబయి: ధన త్రయోదశి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఓ మిఠాయి దుకాణం ‘సువర్ణ కలశ్‌’ పేరుతో మిఠాయిని అందుబాటులోకి తెచ్చింది. పూర్తిగా 24 క్యారెట్ల బంగారు పూతతో దీనిని తయారు చేయడం విశేషం. మొత్తం 12 కేజీల ‘సువర్ణ కలశ్‌’ మిఠాయి తయారు చేసినట్లు రఘువీర్‌ మిఠాయి దుకాణం నిర్వాహకుడు తేజస్‌ పోపత్‌ తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్‌ నుంచి నిపుణుల్ని రప్పించినట్లు వివరించారు. సోమవారం నాటికి ఏడు కేజీల వరకు విక్రయాలు పూర్తయ్యాయన్నారు. కొవిడ్‌-19 కారణంగా గతేడాది ఈ ప్రత్యేక మిఠాయిని తయారు చేయలేదని వెల్లడించారు. ఇంతకీ ఇంటిల్లిపాదీ కలిసి ఓ కేజీ ‘సువర్ణ కలశ్‌’తో నోరు తీపి చేసుకోవాలంటే మాత్రం రూ.11,000 వెచ్చించాల్సి ఉంటుంది. బంగారు మిఠాయి కదా.. అందుకే అంత ధర.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని