PRC : పీఆర్సీపై వెనక్కి తగ్గని ప్రభుత్వం.. మరోసారి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది. తాజా జీతాల,పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌..

Published : 25 Jan 2022 19:06 IST

అమరావతి: పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది. తాజా జీతాల,పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్‌ బిల్లులను ప్రాసెస్‌ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీడీఓలను మరోసారి సర్క్యూలర్‌ జారీ చేసింది. ఓ వైపు పీఆర్సీ సాధన కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఆర్థికశాఖ సర్క్యూలర్‌ జారీ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని