Robotic Surgery: రోబోలతో శస్త్రచికిత్సలు

శస్త్రచికిత్స అంటే అనుభజ్ఞుడైన వైద్యుడితో పాటు ఆయన ధరించే గౌను, గ్లౌజులు గుర్తుకొస్తాయి. విదేశాల నుంచి వైద్యులను తీసుకురావటం చూస్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని చోట్ల చికిత్స చేస్తూ.. వైద్య పరికరాలను కడుపులోనే పెట్టేసి, కుట్టేసిన వార్తలను కూడా మనం

Published : 18 Jul 2021 01:31 IST

శ్రీనగర్‌: శస్త్రచికిత్స అంటే అనుభజ్ఞుడైన వైద్యుడితో పాటు ఆయన ధరించే గౌను, గ్లౌజులు గుర్తుకొస్తాయి. విదేశాల నుంచి వైద్యులను తీసుకురావటం చూస్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని చోట్ల చికిత్స చేస్తూ.. వైద్య పరికరాలను కడుపులోనే పెట్టేసి, కుట్టేసిన వార్తలను కూడా మనం విన్నాం. కానీ పరిస్థితులు మారిపోయాయి.  సాంకేతికతను వినియోగించుకుంటూ.. అందుబాటులో అనుభవజ్ఞుడైన వైద్యుడు లేకున్నా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా రోబోల సాయంతో శస్త్రచికిత్స చేయొచ్చంటున్నారు వైద్య నిపుణులు.

వైద్యరంగంలో ప్రస్తుతం రోబోలయుగం నడుస్తోంది. క్లిషమైన శస్త్రచికిత్సలను సునాయాసంగా నిర్వహించేందుకు రోబోల వాడకం పెరిగింది. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా రోబోలతో సర్జరీలు చేస్తున్నారు. ఈ సాంకేతికతపై వైద్యులకు అవగాహన కల్పించేందుకు శ్రీనగర్‌లో మూడు రోజులపాటు వర్క్​షాప్​ నిర్వహించారు. రోబోటిక్‌తో శస్త్రచికిత్సలు మెరుగైన రీతిలో జరపడమే కాకుండా.. అత్యంత సులభమవుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

ఈ రోబోటిక్ యంత్రాన్ని రిమోట్‌ సహాయంతో ఆపరేట్ చేయవచ్చని డాక్టర్ సయ్యద్ ముస్తాక్‌ తెలిపారు. ఇలాంటి శస్త్రచికిత్సల సమయంలో గౌన్లు, ఇతర వైద్య పరికరాల వంటి ముందస్తు జాగ్రత్త చర్యలను సర్జన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ రోబోటిక్ మెషీన్‌ని ఏ వయసు సర్జన్ అయినా ఆపరేట్ చేయవచ్చని డాక్టర్ ముఫ్తీ మహమూద్ తెలిపారు. సాధారణంగా అనుభవజ్ఞులైన వైద్యులు వయస్సు సంబంధిత కారణంగా శస్త్రచికిత్స చేయలేరు. కానీ ఇప్పుడు వారు రిమోట్ సాయంతో సులభంగా చేయగలుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

రిమోట్ సర్జరీ కోసం విదేశాలల్లోని వైద్యులను ఆహ్వానించవచ్చని డాక్టర్ ముఫ్తీ తెలిపారు. రోబోటిక్ యంత్రంతో ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయవచ్చన్నారు. శరీరంలో కొన్ని ప్రదేశాలలో చికిత్స కష్టతరమని.. కానీ రోబోటిక్ యంత్రం సాయంతో ఆయా చికిత్సలను సులభంగా చేయవచ్చని పేర్కొన్నారు. ఈ తరహా యంత్రాలు ప్రస్తుతం భారతదేశంలో 12 మాత్రమే ఉన్నాయని.. దీని ధర రూ.20 నుంచి రూ. 25 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని